ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) 71వ ఎడిషన్ పోటీలు భారత్‌లో ఈ నెల 18 నుంచి జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. న్యూఢిల్లీలో ప్రారంభ వేడుకతో పోటీలు ఈ నెల 18 ప్రారంభమై మార్చి 9 ముంబైలో ముగస్తాయి. న్యూఢిల్లీలోని భారత్ మండపం సహా వివిధ వేదికల్లో పోటీ జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన 120 మంది అందెగత్తెలు వివిధ పోటీల్లో, దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా పట్ల నాకున్న ప్రేమ దాచలేనిది. ఈ దేశంలో ప్రపంచ సుందరి పోటీ జరగడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది అని మిస్ వరల్డ్ సంస్థ సీఈవో, అధ్యక్షురాలు జులియా మోర్లే అని అన్నారు.
