తాప్సీ ప్రధాన పాత్రలో ఆర్ఎస్జె స్వరూప్ తెరకెక్కించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ అందుకొంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో ముగ్గురు పిల్లల నటన హైలైట్‌గా నిలిచింది. దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకునే క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఎంటర్టైనింగ్గా
ఉన్నాయి. నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో తాప్సీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించింది. ముగ్గురు పిÊ్లలల సహాయంతో ఆమె ఓ పెద్ద మిషన్‌ను ఎలా పూర్తి చేసింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా కథాంశం అని చిత్ర వర్గాలు తెలిపాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మార్క్ కె.రాబిన్ స్వరాలందించారు. ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: దీపక్ యెరగరా.