ఖతర్‌లో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాలకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఏ గడ్డపైనా ఉన్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా స్వీయ సంస్కృతిపై మక్కువతో, మాతృభూమిపై మమకారంతో, మన సంస్కృతిని, పండుగలను జరుపుకుంటున్న ప్రవాసుల కృషిని ఆమె కొనియాడారు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన మెగా బతుకమ్మ సంబురాలను ఖతర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దోహలోని లయోలా ఇంటర్నేషనల్ స్కూల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖతర్‌లోని అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్మాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి ఖతర్ సభ్యులు సుధ శ్రీ రామోజు, మమత దుర్గంతో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్, న్యూజిలాండ్, సౌదీ, బహ్రెయిన్, మహారాష్ట్ర జాగృతి సంస్థల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.