Namaste NRI

మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, బ‌లగం న‌టుడు ప్రియదర్శి కాంబోలో ఒక సినిమా రూపొందు తున్న విష‌యం తెలిసిందే. సారంగపాణి జాత‌కం అంటూ ఈ సినిమా రాబోతుంది. రూప కొడువాయూర్ క‌థానాయిక.   శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటు న్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుదల తేదీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుకగా,  డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేస్తుంది చిత్రబృందం. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను వ‌దిలిన మేక‌ర్స్ తాజాగా టీజ‌ర్ అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమా టీజ‌ర్‌ను నవంబ‌ర్ 21న ఉద‌యం 11.12 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఒక ఫ‌న్నీ వీడియోను విడుద‌ల చేసింది. ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తుండ‌గా,  వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events