Namaste NRI

జొమాటోకు మోహిత్ గుప్తా గుడ్ బై

ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న మోహిత్ గుప్తా గుడ్ బై చెప్పారు. నాలుగున్నరేళ్లు కంపెనీతో కొనసాగిన ఆయన రాజీనామా చేశారు. కంపెనీకి గుడ్‌ బై చెప్పినప్పటికీ తాను జొమాటోలో ముదుపరుడిగా ఉంటానని తన రాజీనామా లెటర్‌లో మోహిత్‌ వెల్లడించారు. జొమాటోలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న మోహిత్‌ తన పనితీరుతో 2020లో కో-ఫౌండర్‌ స్థాయికి ఎదిగారు. ‘నేను నాలుగున్నర ఏళ్ల కింద జొమాటోలో చేరాను. ఈ సంస్థను మనదేశంలోనే బెస్ట్ ఫుడ్‌ టెక్ కంపెనీగా మార్చాలనే లక్ష్యంతో పనిచేశాను. ఇతర ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి పోటీ ఎదురైనా, ప్యాండెమిక్ టైంలో నష్టాలు వచ్చినా కూడా మళ్లీ లాభాల బాటలో నడిచాం’ అని మోహిత్‌ అన్నారు.

 కో-ఫౌండర్‌గా ఉన్న మోహిత్‌ జొమాటోను వీడడం కంపెనీకి ఎదురుదెబ్బ. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులు ముగ్గరు రాజీనామా చేశారు. జొమాటో న్యూ ఇనిషియేటివ్‌ హెడ్ రాహుల్ గంజూ, జొమాటోస్ ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్‌ సిద్ధార్థ్‌ ఝావర్‌లు వారం రోజుల వ్యవధిలోనే కంపెనీకి గుడ్‌ బై చెప్పారు.

Social Share Spread Message

Latest News