అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినాదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత`ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. భారత సంతతి అమెరికన్లు వివిధ అంచెల ఎన్నికల్లో మరింత ఎక్కువ సంఖ్యలో పోటీచేయాలని సూచించారు. డెమోక్రాటిక్ పార్టీకి అనుబంధమైన ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ సంస్థ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. ఈ సంస్థ అమెరికా ఎన్నికల్లో పోటీచేసే భారతీయ అమెరికన్లకు ఆర్థికంగా, ఇతర మార్గాల్లో సహాయ సహకారాలు అందిస్తుంది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)లో ప్రస్తుతం అయిదుగురు భారతీయ అమెరికన్ సభ్యులున్నారు. 2024 చివరికి వీరి సంఖ్య 10కి పెరుగుతుందని ఇంపాక్ట్ సంస్థ అంచనా.