నాని హీరో గా నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మృణాల్ ఆకర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించింది మోడిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు మృణాల్. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. హాయ్ నాన్న ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాతలు: మోహన్ చెరుకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి, దర్శకత్వం: శౌర్యువ్.