Namaste NRI

సంక్రాంతి బరిలో ఎం.ఎస్ రాజు – 7 డేస్ 6 నైట్స్

రొమాంటిక్‌ కామెడీ చిత్రం 7 డేస్‌ 6 నైట్స్‌ తో సంక్రాంతి రిలీజ్‌ బరిలో దిగనున్నారు. మెగా బ్యానర్‌ సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌. రజనీకాంత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్‌ పిక్చర్స్‌ మరియు ఏబిజీ క్రియేషన్స్‌ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ నేను నా కెరీర్‌లో అన్ని జానర్‌ చిత్రాలు చేసాను. ఇక కేవలం మసాలా చిత్రాలకి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరు చేయనివి చేద్దా మనుకుంటున్నాను. ప్రతీ ఒక్కరు, తమని తాము ఇందులోని పాత్రలకి బాగా రిలేట్‌ చేసుకుంటారు అన్నారు. సంక్రాంతి కి రానున్న ఈ చిత్రం, అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం అని అన్నారు. సంక్రాంతి బరిలోని భారీ చిత్రాల మధ్య విడుదల చేస్తూ కూడా ఎం.ఎస్‌ రాజు  ఈ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసంతో ఉండడం విశేషం. సంగీతం: సమర్థ్‌ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడి శెట్టి, కో ప్రొడ్యూసర్స్‌ : జె. శ్రీనివాసరాజు, మంతెన రాము.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events