భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో నిర్వహించిన విందు కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, ఆల్భాబెట్ ఇన్కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీ గూగుల్ సిఇఓ సుందర్ పించయ్, ఆయన సతీమణి అంజలీ పిచయ్ పాల్గొన్నారు. ఈ విందుకు హాజరైన ప్రముఖులలో మైక్రోసాఫ్ట్ సివిఓ సత్య నాదెళ్ల, యాపిల్ సిఇఓ టిమ్ కుక్, పారిశ్రామిక వేత్తలు ఆనంద్ మహీంద్ర, అడోబ్ సిఇఓ శాంతను నారాయణ్, పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రా నూయి, జీరోధ సిఇఓ నిఖిల్ కామత్, నెట్ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బజారియా తదితరులు ఉన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-218.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-217.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-218.jpg)