ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రతి రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చీరల వ్యాపారంలోకి కూడా ఆయన అడుగుపెట్టబోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రీటైల్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతోంది. చీరలతో పాటు భారతీయ సంప్రదాయ దుస్తుల అమ్మకాల కోసం అవంత్రా బ్రాండ్ నేమ్ తో స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ పండుగ సీజన్ లోనే బెంగళూరులో తొలి స్టోర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది.
ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, టాటా గ్రూప్‌కు చెందిన తనిష్‌కు పోటీగా ఈ వ్యాపారాన్ని ముఖేశ్ అంబానీ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. తనిష్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ సంస్థలు కూడా త్వరలోనే సంప్రదాయ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి.