Namaste NRI

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఈ సంఘటన జరిగింది. కారులో కూర్చొన్న అతడిపై దుండగుడు గన్‌తో కాల్పులు జరిపాడు. 32 ఏళ్ల సత్నామ్‌ సింగ్‌, స్నేహితుడి నుంచి కారు తీసుకున్నాడు. ఒక వ్యక్తిని రిసీవ్‌ చేసుకునేందుకు ఇంటికి సమీపంలోని సౌత్‌ ఓజోన్‌ పార్క్‌ వద్ద కారు నిలిపి వేచి ఉన్నాడు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి డ్రైవింగ్‌ సీటులో కూర్చొని ఉన్న సత్నామ్‌ సింగ్‌పై గన్‌తో కాల్పులు జరిపాడు. బులెట్‌ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. సత్నామ్‌ సింగ్‌ చాలా మంచి వాడని పొరుగు వారు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై న్యూయార్క్‌ పోలీసులు రద్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోని సీసీటీఈ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events