అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో 2002లో తెలుగు యువకుడు సహా ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన 41 ఏళ్ల దోషికి మరణశిక్ష అమలు చేశారు. ఓ వ్యక్తికి మరణశిక్ష విధించడం ఒక్లహామాలో ఈ ఏడాది ఇదే తొలిసారి. మెక్‌అలెస్టర్ పట్టణంలోని ఒక్లహామా రాష్ట్ర జైలులో దోషి మైఖేల్ డెవేన్ స్మిత్‌కు ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. స్టోర్ క్లర్క్ అయిన 24 ఏండ్ల తెలుగు యువకుడు శరత్ పుల్లూరు, 40 ఏండ్ల జానెట్ మూర్‌ను 22 ఫిబ్రవరి 2002లో వేర్వేరు ఘటనల్లో హత్యచేసిన కేసులో స్మిత్ శిక్ష అనుభవిస్తు న్నాడు. స్మిత్ మరణం నిర్ధారణ అయిన తర్వాత ఒక్లహామా అటార్నీ జనరల్ జెంట్నెర్ డ్రమండ్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ స్మిత్‌కు మరణశిక్ష అమలుచేయడం ద్వారా 22 ఏండ్ల సుదీర్ఘకాలం తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్టు పేర్కొన్నారు.