Namaste NRI

మస్క్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు ..ఎక్స్ సేవలపై నిషేధం

సోష‌ల్ మీడియా ఎక్స్‌పై  బ్రెజిల్‌లో నిషేధం విధించారు. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు  ఆ దేశానికి లీగ‌ల్ ప్ర‌తినిధిని ఎక్స్ నియ‌మించ‌లేదు. దీంతో ఆ మీడియాపై సుప్రీం జ‌డ్జి బ్యాన్ విధించారు. కోర్టు ఆదేశాల‌ కు త‌గిన‌ట్లు చ‌ర్యలు తీసుకునే వ‌ర‌కు ఎక్స్‌ను త‌క్ష‌ణ‌మే బ్యాన్ చేస్తున్న‌ట్లు జ‌డ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపా రు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జ‌రిమానాల‌ను కూడా ఎక్స్ చెల్లించాల‌ని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. త‌ప్పుడు స‌మాచారం చేర వేస్తున్న ఎక్స్ అకౌంట్ల‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఏప్రిల్‌లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణ‌యంపై ఎక్స్ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ స్పందించారు. ప్ర‌జాస్వామ్యానికి ఫ్రీ స్పీచ్ కీల‌క‌మ‌ని, రాజ‌కీయాల కోసం ఆ వాక్ స్వేచ్ఛ‌ను నాశ‌నం చేస్తున్న‌ట్లు మ‌స్క్ ఆరోపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress