Namaste NRI

మురళీ మోహన్ చేతుల మీదుగా మటన్ సూప్ మాస్ ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు బ్యానర్లపై తెరకెక్కించిన చిత్రం మటన్‌ సూప్‌. విట్‌నెస్‌ ది రియల్‌ క్రైమ్‌ ట్యాగ్‌ లైన్‌.రమణ్‌, వర్షా విశ్వనాథ్‌ హీరో, హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌), రామకృష్ణ సనపల, అరుణ్‌ చంద్ర వట్టికూటి నిర్మించారు. తాజాగా నటుడు మురళీ మోహన్‌ కల్లు కొట్టు కాడ అంటూ సాగే మంచి మాస్‌ ఎనర్జిటిక్‌ నెంబర్‌ను రిలీజ్‌ చేశారు.ఈ సందర్భంగా మురళీ మోహన్‌ మాట్లాడుతూ టైటిల్‌ చాలా బాగుంది. యంగ్‌ టీం చేసిన ఈ ప్రయత్నానికి పెద్ద సక్సెస్‌ దక్కాలి. సాంగ్‌ చాలా బాగుంది. అల వైకుంఠపురములో సూరన్న మంచి పాటను పాడారు. జాన పద గీతాలు ప్రస్తుతం ఎక్కువ సక్సెస్‌ అవుతున్నాయి అని తెలిపారు.


సినిమా చాలా బాగా వచ్చింది. ఈ పాట ఎస్‌ఆర్‌కే వల్లే పుట్టింది. గోపాల్‌ లేకపోతే ఈ ప్రాజెక్ట్‌ ఉండేది కాదు. మా సినిమాను పర్వతనేని రాంబాబు నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లారు. త్వరలోనే ఆడియెన్స్‌ ముందుకు సినిమాని తీసుకొస్తాం అని దర్శకుడు రామచంద్ర వట్టికూటి చెప్పారు. నిర్మాతలు మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌), రామకృష్ణ సనపల మాట్లాడుతూ మా చిత్రంలోని కల్లు కొట్టు కాడ అంటూ సాగే రెండో పాటను రిలీజ్‌ చేసిన మురళీ మోహన్‌కి థ్యాంక్స్‌. ఇలాంటి పెద్దల సహకారం వల్లే మాలాంటి చిన్న నిర్మాతలు, మాలాంటి వాళ్లు తీసే చిన్న చిత్రాలు నిలబడుతున్నాయి అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events