ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ప్రియదర్శి మాట్లాడుతూ ఇది నా డ్రీమ్‌టీమ్. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది అన్నారు.

అందరూ తెలుగు ఆర్టిస్టులు నటించిన పూరిపూర్ణమైన తెలుగు సినిమా ఇదని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. కేవలం జాతకాలను మాత్రమే నమ్మకుండా మనం చేయాల్సిన పని చేయాలనే గొప్ప పాయింట్‌ను ఆవిష్కరించే చిత్రమిదని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు.
