Namaste NRI

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇకలేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో నెల రోజులుగా హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న భాస్కరరావు బుధవారం ఉదయం కన్నుమూశారు. భాస్కరరావు పార్థివదేహాన్ని ఆసుపత్రి నుండి జూబ్లీ హిల్స్ లోని స్వగృహనికి తరలించారు. గురువారం హైదరాబాద్ పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

భాస్కరరావుకు ఇద్దరు కుమారులు నాదెండ్ల మనోహర్, మురళి వున్నారు. మనోహర్ జనసేన లో కీలక నేతగా, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగావున్నారు.1935 జూన్ 23న గుంటూరులో పిచ్చయ్య ,వెంకయమ్మ జన్మించారు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం దోనెపూడి వారి స్వగ్రామం. 1960 నుండి 1977 వరకు హై కోర్టు లో న్యాయవాదిగా చేసారు. న్యాయవాది గా వుంటూ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇందిరా కాంగ్రెస్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గా చేసారు. ఆ పార్టీ నుండి 1978 లో విజయవాడ 2 నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1982 లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ కి రాజానామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1982 లో ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రి మండలి లో ఆర్థిక మంత్రిగా చేసారు.

1984 లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు ఆయన్ను పదవి నుండి తప్పించి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో కలిసి 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా వ్యవహరించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ఎమ్మెల్యే ల మద్దతు లేకపోవడంతో సిఎం పదవికి రాజీనామా చేశారు. మళ్లీ కాంగ్రెస్ లో చేరి తెనాలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది వ్యవసాయ శాఖ, న్యాయ శాఖ, ఎక్సైజ్, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998 లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు.తరువాత బిజెపి లో చేరిన తర్వాత వయోభారం , అనారోగ్యంతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events