నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. మత్స్యకారుల నేపథ్య కథాంశమిది. సాయిపల్లవి కథానాయిక. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం కర్ణాటక ఉడిపిలో ప్రారంభమైంది. సముద్రం మధ్యలో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ పార్ట్ రొమాంచితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం నాగచైతన్య సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారు. మంగళవారం విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య సముద్రం వైపు నడుస్తు ఆనందంగా కనిపిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, యాక్షన్ ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం వస్తున్నట్టు సమాచారం. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. తండేల్‌కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.