Skip to main content

Namaste NRI

నాగచైతన్య తండేల్‌ షూటింగ్ షురూ

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్‌. మత్స్యకారుల నేపథ్య కథాంశమిది. సాయిపల్లవి కథానాయిక. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ కొద్ది రోజుల క్రితం కర్ణాటక ఉడిపిలో ప్రారంభమైంది. సముద్రం మధ్యలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్‌ పార్ట్‌ రొమాంచితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం నాగచైతన్య సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారు. మంగళవారం విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య సముద్రం వైపు నడుస్తు ఆనందంగా కనిపిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, యాక్షన్‌ ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు.

2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం వస్తున్నట్టు సమాచారం. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్‌. తండేల్‌కు అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షామ్‌దత్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events