
అనంత పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయాల్లో కనుగొనబడిన గుప్త నిధుల వృత్తాంతం నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న భారీ పాన్‌ఇండియా చిత్రం నాగబంధం. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ఉపశీర్షిక. విరాట్ కర్ణ ప్రధాన పాత్రధారి. అభిషేక్ నామా రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. రానా దగ్గుబాటి పోస్టర్‌ని ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. సముద్రంలో భయంకరమైన ముసలితో పోరాడుతూ.. ఫెరోషియస్‌గా రగ్గడ్ అవతారంలో సాలిడ్ ఫిజిక్‌తో విరాట్ కర్ణ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నదని, ఆధ్యాత్మికతతో కూడిన ఉత్కంఠభరిత సాహసయాత్రగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
