Namaste NRI

నాగార్జున నా సామిరంగ ఫస్ట్‌సింగిల్‌

నాగార్జున నటిస్తున్న చిత్రం నా సామిరంగ. ఆషికా రంగనాథ్‌ కథానాయిక.  విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత.  చంద్రబోస్‌ రాయగా, ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది అంటూ సాగే ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్‌ త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌పై కాలు వేసి, బీడీ కాలుస్తూ పక్కా మాస్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు నాగ్‌. నాగార్జున కెరీర్‌లోనే ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారని, కథ, కథనాలు వాస్తవికతకు అద్దంపట్టేలా ఉంటాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో కరుణకుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణం చివరిదశకు చేరుకున్న ఈ చిత్రానికి మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events