Namaste NRI

బ్రహ్మస్త్ర  మూవీ నుంచి నాగార్జున పోస్టర్‌ రిలీజ్‌

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ నాయికానాయకులుగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర.  ఇది తెలుగులో బ్రహ్మాస్త్రంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అగ్ర హీరో నాగార్జున పురావస్తు శాస్త్రవేత్తగా కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ సందర్భంగా  ఆయనకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌నను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ, కథానాయిక అలియాభట్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో నాగ్‌ అనీష్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. శివుడి వాహనం నంది మా అనీష్‌ వేయి నందులకు మించిన శక్తి మంతుడు జూన్‌ 15న విడుదలయ్యే ట్రైలర్‌లోనూ ఇదే చూడబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుడల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events