Namaste NRI

నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి వచ్చేది అప్పుడే

నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ సినిమాలో షిర్లీ సెటియా హీరోయిన్‌. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.  రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతోన్న చిత్రమిది. నాగశౌర్య గత పాత్రలకు భిన్నంగా తొలిసారి ఈ చిత్రంలో వినోదభరితమైన పాత్రలో కనిపించనున్నాడు అని నిర్మాతలు అన్నారు. అనీష్‌ ఆర్‌.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌, కెమెరా: సాయి శ్రీరామ్‌, సహ నిర్మాత: బుజ్జి. ఈ సినిమాను ఏప్రిల్‌ 22న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events