హైదరాబాద్‌లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రాపర్టీ షో ఘనంగా ప్రారంభమైంది. మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహించిన ట్రెడా 11వ ప్రాపర్టీ షోను సినీహీరో నాగశౌర్య ప్రారంభించారు. ఈ సందర్భగా నాగశౌర్య మాట్లాడుతూ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతం అని అన్నారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే విలువ తప్పక పెరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీల ప్రదర్శనలో వందకుపైగా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు, బ్యాంకింగ్ ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ ప్రాపర్టీలో షోలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్‌తో సహా పలు రకాల ప్రాపర్టీలను డెవలపర్లు అందజేస్తున్నారని ట్రెడా అధ్యక్షులు ఆర్ చలపతిరావు తెలిపారు. వీటికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల నుంచి గృహరుణాలు పొందే సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. జంట నగరాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 3 వరకు ఈ ప్రాపర్టీ షో కొనసాగతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెడా ప్రధాన కార్యదర్శి సునీల్ చంద్రారెడ్డి, కార్వనిర్వాహక ఉపాధ్యక్షుడు విజయసాయి, కోశాధికారి కె శ్రీధర్ రెడ్డి, బిల్డర్లు, డెవలపర్లు పాల్గొన్నారు.