
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. అజయ్‌కుమార్‌రాజు నిర్మాత. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి నాలో నేను అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను ఆదిత్య రవీంద్రన్ స్వరపరచగా, సంజిత్ హెగ్డే ఆలపించారు. నాలో నేను, తనలో తాను, కలిసే ఉన్నాం విడిగా అంటూ మెలోడియస్‌గా సాగే ఈ పాట అందర్నీ అలరిస్తోంది అని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎడిటర్ – గణేష్ శివ, డీవోపీ – దినేష్ పురుషోత్తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్‌ఎస్ వర్మ.















