అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్నీ పెలోసీ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఆమె రాకు సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. స్వేచ్ఛకోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చామని పెలోసీ తెలిపారు. పోరాటం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామన్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే నాన్సీ పెలోసీ ఉక్రెయిన్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా దండయాత్రను ఉక్రెయిన్ ప్రజల ధైర్యంగా, గుండెనిర్బరంతో ఎదుర్కొంటున్నారని ఆమె ప్రశంసించారు. రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్ మద్దతు ఇస్తున్నందుకు అమెరికాకు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)