Namaste NRI

చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా అభిమానులకు, ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.పోస్ట‌ర్‌ లో క‌ళ్యాణ్ రామ్ డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఒక చేతిలో ప‌దునైన ఆయుధం ప‌ట్టుకుని ఉన్నారు. మ‌రో చేతిలో గ‌న్‌తో షూట్ చేస్తున్నారు. ఆయ‌న యాక్ష‌న్ మోడ్‌లోని ఇన్‌టెన్స్ లుక్ చూస్తుంటే డెవిల్ వంటి మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో అల‌రించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా  నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ మా బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని ఓ కొత్త పాయింట్‌ను చూపిస్తూ పీరియాడిక్ మూవీగా డెవిల్ సినిమాను రూపొందిస్తున్నాం. వెర్స‌టైల్ మూవీస్ చేస్తూ వ‌స్తోన్న క‌ళ్యాణ్ రామ్ మ‌రోసారి డెవిల్ సినిమాతో స‌ర్‌ప్రైజ్ ఇస్తారు. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. న‌వీన్ మేడారంగారు సినిమాను సూప‌ర్బ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్ అందిస్తాం అన్నారు.

 ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌: దేవాన్ష్ నామా, బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌, నిర్మాత‌: అభిషేక్ నామా, ద‌ర్శ‌క‌త్వం: న‌వీన్ మేడారం, సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌, స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌: శ్రీకాంత్ విస్సా, మ్యూజిక్ : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, కో డైరెక్ట‌ర్‌: చ‌ల‌సాని రామారావు, స్టోరి డెవ‌ల‌ప్‌మెంట్: ప్ర‌శాంత్ బ‌ర‌ది, సి.ఇ.ఒ: పోతిని వాసు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events