హీరో నాని హాయ్ నాన్న లో నటిస్తున్న విషయం తెలిసిందే. . తాజా సమాచారం ప్రకారం నాని తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. దీనికి డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని సమాచారం. తమిళంలో శివకార్తికేయన్ నటించిన డాన్ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు సిబి చక్రవర్తి. ఇటీవలే ఆయన నానికి ఓ కథను వినిపించాడని, వైవిధ్యమైన సబ్జెక్ట్ కావడంతో ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.
