నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నది. శౌర్యువ్ దర్శకుడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నడిచే కథాంశమిది. నాని కూతురు పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తున్నది. ఈ సినిమాలోని రెండో గీతం గాజు బొమ్మ ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కథలోని ఆత్మను ఆవిష్కరిస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధానికి దర్పణంలా ఈ పాట ఉంటుందని చిత్ర బృంద పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్.
