
నటుడు వీకే నరేష్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస మంగపురం. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని ఈ సినిమాతో వెండితెరకి పరిచయం కాబోతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నరేష్ ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో నరేష్ స్వతంత్ర బాబు అనే ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. తనదైన శైలిలో జీవితాన్ని జీవిస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదించే ఒక స్వతంత్రమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర ఇది అంటూ నరేష్ పాత్రను పేర్కొంది. నరేష్ కెరీర్‌లో మళ్ళీ పెళ్ళి, సమాజవరగమన వంటి సినిమాల తర్వాత ఇది మరో ల్యాండ్‌మార్క్ రోల్ అవుతుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.















