Namaste NRI

నాసా ట్రెయినీ ఆస్ట్రోనాట్ గా భారతీయ సంతతి వ్యక్తి

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టబోతున్న వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌) శిక్షణా కార్యక్రమానికి  భారతీయ సంతతి వ్యక్తి ఎంపికయ్యారు. యూక్రెయిన్‌ భారతీయ మూలాలున్న డా.అనీల్‌ మీనన్‌ ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.  ఈ కార్యక్రమానికి మొత్తం 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా నాసా చివరికి 10 మందిని ఎంపిక చేసింది. వీరిలో అనీల్‌ మీనన్‌ కూడా ఒకరు. రెండేళ్ల పాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం ఈ 10 మంది అంతరిక్ష మిషన్లలో వ్యోమగాములుగా పాల్గొంటారు. డా.మీనన్‌(45) మిన్నెసొటా రాష్ట్రంలో జన్మించారు. గతంలో ఆయన స్పేస్‌ ఎక్స్‌ సంస్థలో ఫ్లైట్‌ సర్జన్‌గా సేవలందించారు. స్పెక్స్‌ సంస్థ చేపట్టిన డెమో `2 మిషన్‌లో పాలుపంచుకున్నారు. 2014లో ఆయన నాసాలో చేరారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు చెందిన నాలుగు దీర్ఘకాలిక మిషన్లలో డిప్యూటీ క్రూ సర్జన్‌గా పాలుపంచుకున్నారు. సోయూజ్‌ మిషన్లలో ప్రధాన క్రూ సర్జన్‌గా కూడా సేవలందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events