Namaste NRI

నాట్స్ దాతృత్వం : నిజామాబాద్ లోని నిర్మల్ హృదయ్ హైస్కూల్ కు డిజిటల్ బోర్డుల అందజేత

విద్యారంగంలో ఆధునికతను తీసుకువచ్చి, పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పం తో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో ముందడుగు వేసింది. నిజామాబాద్‌లోని నిర్మలా హృదయ్ హైస్కూల్‌ కు విప్లవాత్మకమైన ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డులను దానం చేసింది. కొత్త ఇంటరాక్టివ్ బోర్డులు తరగతి బోధనను మరింత ఆకర్షణీయంగా, దృశ్యపరంగా, విద్యార్థి పాఠాన్ని సులువుగా అర్థం చేసుకునేలా ఈ బోర్డులు ఉపయోగపడనున్నాయి. మల్టీమీడియా వివరణలు, యానిమేషన్లు, డైగ్రామ్‌లు, ఇంటరాక్టివ్ కార్యకలాపాలు వంటి వాటిని ఇక నిర్మల్ హృదయ్ హైస్కూల్‌ తన బోధనలో భాగం చేయనుంది. దీని వల్ల విద్యార్ధులు పాఠ్యాంశాలను మరింత సులభంగా అర్థం చేసుకోగలరు. పాఠశాల యాజమాన్యానికి డిజిటల్ బోర్డులను అందించారు. విద్యాభివృద్ధి పట్ల నాట్స్ చూపుతున్న ఔదార్యానికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. నాట్స్ చేసిన సాయం విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి గొప్ప ప్రేరణనిస్తుందని కొనియాడింది. ఈ దాతృత్వ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ కార్యనిర్వహక సభ్యులు కిరణ్ మందాడి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News