Namaste NRI

నవీన్ చంద్ర మరో మిస్టరీ థ్రిల్లర్ – ఎప్పుడూ రాయని నవల ఆధారంగా

యంగ్ హీరో నవీన్ చంద్ర మరో మిస్టరీ థ్రిల్లర్ అనౌన్స్ చేశారు. సరికొత్త కథాంశంతో నాట్ ఏ డాక్టర్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వం. రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. అడవినేలలో నుంచి బయటకు వస్తున్న మట్టి చేయిని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఆసక్తికరమైన ఏదో కథను ఈ పోస్టర్‌ చెబుతున్నట్టు అనిపిస్తున్నది. ఎప్పుడూ రాయని నవల ఆధారంగా అనే ట్యాగ్‌లైన్‌ ఈ సినిమా కథలో ఉన్న ఉద్వేగాన్ని తెలియజేస్తున్నది. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events