Namaste NRI

నవీన్‌చంద్ర క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. ఉత్కంఠగా బ్లైండ్‌ స్పాట్‌  ట్రైలర్‌

నవీన్‌చంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం బ్లైండ్‌ స్పాట్‌. రాకేష్‌వర్మ దర్శకుడు. మ్యాంగో మీడియా పతాకంపై రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ చిత్రం  ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ హత్య విషయంలో పోలీస్‌ పరిశోధన నేపథ్యంలో ట్రైలర్‌ ఉత్కంఠగా సాగింది. నిజమైన హంతకుడు ఎవరు? అనే ఉత్సుకతను పెంచింది. నవీన్‌చంద్ర మాట్లాడుతూ సీట్‌ఎడ్జ్‌ థ్రిల్లర్‌ ఇది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది.

ఇలాంటి పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది అన్నారు. రోటీన్‌ మర్డర్‌ మిస్టరీ కథలకు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించామని, ప్రేక్షకులకు ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తుందని దర్శకుడు రాకేష్‌ తెలిపారు. రాశీ సింగ్‌ మాట్లాడుతూ కథలో నాది కీలకపాత్ర. నాకు ఇష్టమైన జానర్‌లో రూపొందిన చిత్రమిది అని చెప్పారు. రాశీసింగ్‌, అలీరెజా, రవివర్మ, గాయత్రి భార్గవి తదితరులు నటిస్తు న్నారు.  ఈ చిత్రానికి సంగీతం: శ్రీరామ్‌ మద్దూరి, రచన-దర్శకత్వం: రాకేష్‌వర్మ.

Social Share Spread Message

Latest News