నెదర్లాండ్స్‌లోని ఇందోవెన్ నగరంలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మాధవి గల్లా, గుడివాడ ఎంఎల్ఏ వెనిగండ్ల రాము, చింతలపూడి ఎంఎల్ఏ రోషన్ బాబు, టీడీపీ నాన్ రెసిడెంట్స్ ప్రెసిడెంట్ వేమూరి రవికుమార్ జూమ్ కాల్‌లో పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసి అందరినీ అభినందించారు. తరువాత అభిమానులు అందరూ విజయోత్సవ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యవర్గ సభ్యులు అయిన, వివేక్ కరియావుల, వెంకట్ కోకా, తేజా గోయాల్లా, శ్యామ్ పంపానా, మధుకర్ రెడ్డి, ప్రసాద్, అమర్ రావి, నవీన్ ఆచంటతో జనసేన కార్యవర్గ కమిటీ నుంచి ప్రతాప్, రాజు, శ్రీనివాస్, నాగరాజు, భారతీయ జనతా పార్టీ తరపున ప్రతిమ సింగ్, తిరుమల నాయుడు పాల్గొని తమ ప్రసంగాలుతో ఆహుతులిని అలరించారు. ఈ కార్యక్రమంలో వివిధ నగరాల నుంచి వచ్చిన టీడీపీ, జన సేన, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని సందడిగా సంబరాలు చేసుకున్నారు.

