
భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్, ఎండీహెచ్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవలే సింగపూర్, హాంకాంగ్‌లో వేటుకు గురైన ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తాజాగా ప్రకటించారు. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధిం చినట్లు వెల్లడించారు. ఈ మాసాలాల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నట్లు నేపాల్ పేర్కొంది.
