తమ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని నేపాల్ సంచలన ఆరోపణలు చేసింది. హుమ్లా జిల్లాలోని భూభాగాన్ని చైనా ఆక్రమించిన తర్వాత నేపాల్ ఓ కమిషన్‌ను నియమించింది. ఈ రిపోర్టు ఆధారంగానే నేపాల్ పై వ్యాఖ్యలు చేసింది. నేపాల్‌లోని లలుంగ్‌జోంగ్ ప్రాంతంలో ధార్మిక కార్యక్రమాలపై చైనా ఆర్మీ ఆంక్షలు విధించిందని, పశువులు మేతమేయడాన్ని కూడా తగ్గించేలా చైనా ఆర్మీ చేస్తోందని నేపాల్ ఆరోపించింది. తమ భూభాగం దగ్గర్లో ఓ కంచెను నిర్మించాలని కూడా చైనా ప్రయత్నాలు చేస్తోందని, రోడ్లను నిర్మించాలని కూడా చూస్తోందంటూ నేపాల్ విరుచుకుపడిరది. ఈ నేపథ్యంలో నేపాల్ సరిహద్దుల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని నేపాల్ నిర్ణయించుకుంది.














