Namaste NRI

ఆర్యా హీరోగా నయా యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రారంభం

ఆర్యా హీరోగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పోలూరు కృష్ణ దర్శకుడు. శ్రీవిజయ వారాహి మూవీస్‌ పతాకంపై మురుకుంట్ల అరవింద్‌, విజయ భారతి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు దశరథ్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత విజయభారతి కెమెరా స్విఛాన్‌ చేశారు. మార్చి మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని, జూలైలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. నగర నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిదని దర్శకుడు కృష్ణ పేర్కొన్నారు. దశరథ్‌, వాసుకి, ఆడుకాలం నరేన్‌, సమ్మెట గాంధీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ కె మహేష్‌, సంగీతం: రథన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోలూరు కృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events