గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారులకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ లో మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మార్పుల్లో భాగంగానే ఆరు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆయా ఫీచర్ల ను గూగుల్ గురువారం ప్రకటించింది. ఫ్లై ఓవర్ కాల్ అవుట్ పేరిట కొత్త సదుపాయాన్ని తెచ్చింది. ఆండ్రాయి డ్ యూజర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఈ ఫీచర్ వారంలో అందుబాటులోకి రానుంది. ఐఓఎస్ యూజర్లకు కాస్త ఆలస్యంగా ఈ ఫీచర్ లభించనుంది. దీంతోపాటు ఇరుకు రోడ్లకు సంబంధించిన మరో ఫీచర్ ను కూడా గూగుల్ తీసుకువచ్చింది. ఫోర్ వీలర్ లో వెళ్లేటప్పుడు రోడ్లు ఇరుకుగా ఉంటే అటు వైపు ప్రయాణం వద్దు అని గూగుల్ మ్యాప్స్ లోని కొత్త ఫీచర్ చూపించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇండోర్, బోపాల్, భువనేశ్వర్ వంటి ఎనిమిది నగరాల్లో విడుదల చేసింది.