Namaste NRI

భీమ్లా నాయక్ నుంచి కొత్త పోస్టర్ విడుదల

పవన్‌కల్యాణ్‌ రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భీమ్లానాయక్‌. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన సెభాష్‌ ఆడా గాదు ఈడా గాదు అమీరోళ్ల మేడ గాదు అనే గీతం చక్కటి ప్రజాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో గీతాన్ని ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. అంత ఇష్టం అనే పల్లవితో ఈ పాట సాగనుంది. తమన్‌ సర్వల్ని సమకూర్చారు.  ఈ సందర్భంగా సినిమా తాలూకు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఇగో సంఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నదే చిత్ర ఇతివృత్తం.  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రవి కె చంద్రన్‌, సంగీతం: తమన్‌, సమర్పణ: పీడీవీ ప్రసాద్‌, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, దర్శకత్వం : సాగర్‌ కె చంద్ర. సాగర్‌ కె చంద్ర దర్శకుడు. నిత్యామీనన్‌ కథానాయికగా నటిస్తున్నది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events