సౌదీ అరేబియా ప్రభుత్వం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) నివాసితుల కోసం త్వరలో కొత్త వీసా పథకాన్ని ప్రవేశపెడుతుందని పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్`ఖతీబ్ వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో కింగ్‌డమ్ ప్రారంభించిన పర్యాటక వీసాలు ఇప్పటికే ఉన్నాయని, పర్యాటకం కోసం వచ్చే వారికి నిర్దిష్ట పరిమితులు లేవని తెలిపారు. 2021లో రాష్ట్రంలో 64 మిలియన్ల దేశీయ పర్యటనలు జరిగాయని, అయితే విదేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య గత సంవత్సరం 5 మిలియన్లకు చేరుకుందన్నారు. దిరియా ప్రాజెక్ట్ లోని అల్ బుజైరి ప్రాంతాన్ని ఈ సంవత్సరం తెరవనున్నట్లు తెలిపారు. 2019లో ఉద్యోగాల కల్పనతో పర్యాటక రంగం సహకారం 3 శాతంగా ఉందని, 2030 నాటికి 10 శాతానికి చేరుకోవాలన్నారు. 2019లో జీడీపీలో 3 శాతంగా ఉన్న పర్యాట రంగ ఆదాయాన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దీనికోసం 2030 నాటికి 200 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ వ్యయాన్ని వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.














