దేశ సరిహద్దులను తెరవాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 12 నుంచి ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలో పర్యటించవచ్చని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడ్రెన్ ప్రకటించారు. అనుకున్నదానికంటే ముందే ఆస్ట్రేలియన్లు ఇక్కడి రావడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. దీనికోసం ముందుగానే సరిహద్దులను తెరుస్తున్నామని వెల్లడిరచారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ సహా వీసా మినహాయింపులు ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి కూడా న్యూజిలాండ్‌లో పర్యటించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇలాంటి వారికి మే 1 నుంచి న్యూజిలాండ్‌లో ప్రయాణించవచ్చని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)