వెనెజులా అధ్యక్షుడిగా నికోలాస్ మదురో మరోసారి ఎన్నికయ్యారు. దేశ అధ్యక్ష ఎన్నికల్లో మదురోకు 51 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో మూడోసారి వెనెజులా అధ్యక్షుడిగా నికోలాస్ మదురో భారీ మెజారిటీతో ఎన్నికయ్యా రు. ఈ ఎన్నికల్లో పది మంది దాకా అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం మదురో, యూని టరీ డెమొక్రటిక్ ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఎడ్మండో గోంజాలెజ్ మధ్యే సాగింది. ఇక మొత్తం 80శాతం ఓట్ల ను లెక్కించగా మదురోకు 51.20శాతం పోలైనట్లు తేలింది. ఆయన ప్రధాన ప్రత్యర్థికి కేవలం 44.02 శాతమే లభించాయి. ఈ మేరకు ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ అధికారి ప్రకటించారు.