నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక కథానాయికగా నటిస్తున్న చిత్రం వాట్ ది ఫిష్. వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్ అనేది ఉపశీర్షిక. వరుణ్ కోరుకొండ దర్శకుడు. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మాతలు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ పాన్ ఇండియా సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిహారిక స్టైలిష్‌గా నడుస్తూ కనిపించారు. తన వెనుక డాలర్ ఇమేజ్ వుంది. నిహారిక ఎలిగెంట్ అవతార్‌లో మెరిసే వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఇందులో నిహారిక పేరు అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్. తెలుగుతెరపై ముందెన్నడూ చూడని పాత్ర. అభినయం కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ప్రేక్షకులు నిహారికలో ఓ అద్భుతాన్ని చూస్తారు అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్.
