టిక్‌టాక్ యాప్ పై అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలి కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ యాప్ ప్రమాదకమైందిగా అభివర్ణించారు. నిక్కీ హేలి మాట్లాడుతూ ఆ యాప్‌ను బ్యాన్ చేసే చివరి దేశం అమెరికానే కాబోదన్నారు. చైనా వాటన్నింటిని నియంత్రిస్తోందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యాప్ మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలంటే, మా ఫోన్‌లో ఆ యాప్ ఉందని ఊహించుకోండి. చైనా మీ ఆర్థిక పరిస్థితిని చూడగదు. మీ కాంటాక్టులను సైతం చూడగలుగుతారు. మీరు ఏం క్లిక్ చేశారు. దానిపై ఎందుకు క్లిక్ చేశారు. అది మిమ్మల్ని ఎలా ప్రభావం చేస్తుందో చూస్తారు. మీరుచూసేదాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ టిక్‌టాక్ చాలా ప్రమాదకరమైన భాగం వాటిని కూడా ప్రభావితం చేయగలవు అని పేర్కొన్నారు. భారతదేశం టిక్‌టాక్‌ను నిషేధించిందని తెలిపారు. భారత్, నేపాల్ తదితర దేశాలు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.














