నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా, స్వసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక సినిమాపై రెట్టింపు అంచనాలను క్రియేట్ చేశాయి.

ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి భూ అంటే భూతం అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సింహాచలం మన్నేలా సాహిత్యం అందించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతంలో అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆలపించారు. జూలై 4 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, రచన-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.
