Namaste NRI

తొమ్మిదోసారి బిహార్‌ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్‌ కుమార్‌

బిహార్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. ఉత్కంఠల నడుమ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ కరం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్ఛా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు మంత్రులు గా ప్రమాణస్వీకారం చేశారు.

డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట్‌ చౌదరి, విజయ్‌కుమార్‌ సిన్హా, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చా నుంచి సంతోశ్‌కుమార్‌, సుమన్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.  జేడీయూ నుంచి విజయ్‌ కుమార్‌ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్‌, శ్రవణ్ కుమార్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకరం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాఘట్‌ బంధన్‌కు గుడ్‌బై చెప్పిన నితీశ్‌కుమార్‌, మళ్లీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events