
హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలను సదరు చిత్రాల మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ సినిమా మృత్యుంజయ్. ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రెబా జాన్ కథానాయిక. హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.ఈ టీజర్‌లో శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన ఫ్లాష్‌కట్స్‌ని చూడొచ్చు. చాలా ఫాస్ట్‌గా సాగిపోయిన ఈ టీజర్‌లో శ్రీవిష్ణు ఖైదీగా, ఇన్వెస్టిగేటర్‌గా కనిపిస్తున్నారు. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు.

ఇక రెండో సినిమా విషయానికొస్తే కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనున్నది.సుమంత్ నాయుడు జి. నిర్మాత. శ్రీసుబ్రహ్మణేశ్వర సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. క్రేజీ రైడ్ కోసం రండి – బ్రేక్‌లు లేవు.. నవ్వులు మాత్రమే అనే కోట్ కామెడీ కథాంశంతో సినిమా రూపొందనున్నదని చెబుతున్నది. ఒంగోలు పట్టణం నేపథ్యంలో సినిమా సాగుతుందని పోస్టర్‌లో హోర్డింగ్ తెలియజేస్తున్నది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: రధన్.
