Namaste NRI

దేశంలో ఏ సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు

ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులందరినీ చదివిస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంపై టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల రాష్ట్రానికి చెందిన 740 మంది మెడిసిన్‌ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం ఉక్రెయిన్‌ విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎన్నారైల తరపున మహేష్‌ బిగాల ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events