Namaste NRI

మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికీ లేదు

భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదాస్పద రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ఐదు రోజుల చైనా పర్యటన నేటితో ముగిసి న నేపథ్యంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మయిజ్జు పాల్గొన్నారు. మాల్దీవులు చాలా చిన్న దేశమే కావొచ్చు. అంతమాత్రాన మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికీ లేదు అని మయిజ్జు కామెంట్స్ చేశారు. చైనాకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్న మయిజ్జు తాజాగా చేసిన కామెంట్స్ ఉద్రిక్తలను మరింత పెంచేవిగా ఉన్నాయి.

Social Share Spread Message

Latest News