Namaste NRI

ఎవరు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లో దిగబోం 

ఇరాన్‌తో అమెరికా జరిపే యుద్ధంలో బ్రిటన్‌ చేరదని, అయితే వివిధ దేశాలతో అంతర్జాతీయ సదస్సును నిర్వహించి హొర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తామని యూకే ప్రధాని సర్‌ కీర్‌ స్టార్మర్‌ తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో చేరడానికి యూరోపియన్‌ నాటో దేశాలు నిరాకరించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేసిన క్రమంలో కీర్‌ స్టార్మర్‌ మాట్లాడుతూ నాపై, ఇతరులపై ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని విమర్శలు వచ్చినా, మా దేశ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటాను. ఇది మా యుద్ధం కాదు. అందుకే ఇరాన్‌తో యుద్ధంలో చేరబోం అని ఆయన స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events